Saturday, December 7, 2024

ముంబైలో ‘లైగ‌ర్’.. ఫొటోలు వైర‌ల్..

డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న ‘లైగ‌ర్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరక్కెకుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ‌ విజ‌య్ దేవ‌రకొండ, హీరోయిన్ అన‌న్య పాండేపై కీల‌క స‌న్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముంబైలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, చార్మీ, అన‌న్య పాండే పార్టీ చేసుకున్నారు. ఇందులో క‌ర‌ణ్ జొహార్, మ‌నీశ్‌ మ‌ల్హోత్రా, సారా అలీ ఖాన్‌ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు లైగర్ టీమ్‌ తో దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement