Tuesday, April 30, 2024

రంగ‌బ‌లి మేక‌ర్స్ నుండి లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే

నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో నాగ శౌర్య న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ రంగబలి. ఈ సినిమా జూలై 7న వెండితెరపైకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు విడుదల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేకర్స్ మూవీ నుంచి మ‌రో అప్‌డేట్ ప్ర‌క‌టించారు.

జూన్ 27న సాయంత్రం 04:05 గంటలకు రంగబలి థియేట్రికల్ ట్రైలర్‌ను రిల‌జ్ చేయ‌నున్న‌ట్టు ఈ అప్ డేట్ తో వెల్ల‌డించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ కలర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

- Advertisement -

బ్రహ్మాజీ, మురళీ శర్మ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో ఇతరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కింద రంగబాలిని బ్యాంక్రోల్ చేస్తున్నారు. పవన్ సిహెచ్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement