Thursday, April 25, 2024

మరో సినిమాకు ఓకే చెప్పిన లేడీ సూపర్ స్టార్ ?

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో దశాబ్ద కాలానికి పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే… మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుతూనే తాజాగా మరో సినిమాకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

పృథ్వీరాజ్ సుకుమారన్ అల్ఫోన్స్ పుత్రెన్‌ తో నయనతార ఓ సినిమా చేయబోతున్నారట. కథానాయికగా నటించడానికి ఇప్పటికే సంప్రదించారట. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. అయితే మొదటిసారి నయనతార పృథ్విరాజ్ వెండి తెరపై కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన తిరువోనమ్ రోజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement