Monday, April 29, 2024

తమిళ స్టార్ హీరో సినిమాలో కృతి శెట్టి..?

ఉప్పెన బ్యూటీ కృతిశెట్టిని అందరూ లక్కి బ్యూటీ అంటున్నారు. అందం, టాలెంట్ మాత్రమే కాదు కాస్త లక్ ఉంటేనే ఎవరికైనా సక్సెస్ వస్తుందని..కృతి శెట్టి ఆ కోవకు చెందిన అమ్మాయని అని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది కృతీశెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కృతీశెట్టి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హిరోయిన్ గా ఉంది. ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, హీరో రామ్‌ తాజా చిత్రంలోనూ నటిస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన రాబోయే సినిమా కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలో కృతినే హిరోయిన్ అని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ కూడా దాటి వెళ్లింది. ఒక్క ఛాన్స్‌ దక్కాక రెండో అవకాశం వెంటనే రాకపోవచ్చు. ప్రతిభ ఉన్నా ఇంకో ఛాన్స్‌ రావడానికి టైమ్‌ పట్టొచ్చు. కాని ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి ఆమెకు బంపర్‌ ఆఫర్‌ దక్కిందని టాక్‌. మాస్‌ హీరో ధనుష్‌ సరసన కృతి అవకాశం దక్కించుకున్నారట. ధనుష్‌ హీరోగా ‘మారి’, ‘మారి 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్‌ ఈ హీరోతో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోనే కృతి నాయికగా నటించనున్నారని సమాచారం. ధనుష్‌లాంటి హీరోతో తొలి ఎంట్రీ అంటే.. లక్కీయే.

Advertisement

తాజా వార్తలు

Advertisement