Wednesday, May 15, 2024

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన కృష్ణ వ్రింద‌ విహారి…

నాగ‌శౌర్య హీరోగా న‌టించిన కృష్ణ వ్రింద విహారి. ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను రూపొందించాడు. ఆచారాలు, సంప్ర‌దాయాల‌తో కూడిన కుటుంబంలో పెరిగిన కృష్ణాచారి అనే బ్రాహ్మ‌ణ యువ‌కుడు ఆధునిక భావాలున్న వ్రిందా అనే అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు. అబ‌ద్దాలు ఆడి త‌న ప్రేమ‌ను గెలిపించుకోవాల‌ని అనుకున్న కృష్ణాచారికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌నే పాయింట్‌తో ఎమోష‌న్స్‌కు వినోదాన్ని జోడించి అల‌రించారు. కాగా, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన నెల రోజుల్లోనే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. అక్టోబ‌ర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో షిర్లే సేతియా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ వ్రింద విహారి సినిమాను నాగ‌శౌర్య త‌ల్లిదండ్రులు శంక‌ర్‌ప్ర‌సాద్‌, ఉష నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement