Sunday, May 5, 2024

క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.

అదేంటంటే వచ్చే… అక్టోబర్ 8న ఈ సినిమాని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ కూడా ఇప్పటివరకు ఈ సినిమాకు ఫిక్స్ చేయలేదు. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎక్కడా రాలేదు. మరి చూడాలి రిలీజ్ అదే సమయానికి చేస్తారో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement