Monday, April 29, 2024

కిసీ కా భాయ్ కిసికీ జాన్.. స‌ల్మాన్ కి మ‌రో ఫెయిల్యూర్

రంజాన్ కానుక‌గా విడుద‌ల‌యింది కిసీ కా భాయ్ కిసికీ జాన్. తమిళంలో విజయవంతమైన వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) సినిమాకు ఇది రీమేక్‌. హీరోగా బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ న‌టించాడు. పూజా హెగ్గే హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నేటివిటీ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సల్మాన్ గత సినిమాలకంటే అన్ని భాషల్లో అతి తక్కువ ఆక్యుపెన్సీ లభించింది. తొలి రోజు కలెక్షన్స్ రూ. 15 కోట్లు కూడా మించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలు తొలి రోజు కనీసం 20 కోట్లపైనే రాబట్టాయి. ఈ లెక్కన కిసీ కా భాయ్ కిసి కీ జాన్’ సినిమాతో బాలీవుడ్ కండల వీరుడి ఖాతాలో మరో ఫెయిల్యూర్ పడినట్టేన‌నే టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement