Sunday, April 28, 2024

కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ

హీరోయిన్ల విషయంలో ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా మంచి క్రేజ్ లో ఉన్న హీరోయిన్ అయితే అది మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే కీర్తి సురేష్ విషయంలో అదే జరుగుతోంది. కీర్తి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో మెగా వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ చెన్నై కి చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతుందని త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ప్రచారం జరిగింది.

మొదట ఈ వార్తలపై కీర్తి సురేష్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు స్పందించింది. అసలు తనకు పెళ్లి ఆలోచన లేదని…. తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని తేల్చి చెప్పేసింది. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అబ్బాయిని ఫైనల్ చేసుకుంటే ఆ వార్తను కచ్చితంగా బయటకు చెబుతానని చెప్పు వచ్చింది. కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది కీర్తి సురేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement