Tuesday, October 8, 2024

నేడే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ర‌మేశ్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ఖిలాడి. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందని టాక్. ఒక్క నైజామ్ ఏరియాలోనే 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందట‌. క్రితం ఏడాది హీరో రవితేజ నుంచి వచ్చిన ‘క్రాక్’ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ ఎఫెక్ట్ వల్లనే ఈ సినిమా బిజినెస్ ఈ రేంజ్ లో జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. టీజర్ .. ట్రైలర్ లు అంచనాలు పెంచాయి. హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు. కీలకమైన పాత్రలో అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. మ‌రి ఈ చిత్రం ర‌వితేజ‌కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement