Saturday, November 9, 2024

Guntur: లైంగిక వేధింపులతో యువతి ఆత్మహత్య

లైంగిక వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శావల్యాపురం మండలం శానంపూడిలో లైంగిక వేధింపుల కారణంగా శ్రావణి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణిని గత కొద్ది రోజులుగా నాగేంద్ర అనే యువకుడు వేధిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం యవతి తండ్రితో కూడా నాగేంద్ర గొడవకు దిగాడు. అందరిని చంపుతానని నాగేంద్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. అవమానభారంతో శ్రావణి ఎలుకల మందు తినేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement