Friday, November 8, 2024

TS : ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనున్న ప్రియాంక గాంధీ

రాష్ట్రానికి మ‌రోసారి ప్రియాంక గాంధీ రానున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి చివ‌రి రోజు కావ‌డంతో ఆమె రెండు చోట్ల పాల్గొన‌నున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపుకోసం ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ తాండూరు, కామారెడ్డిల‌లో నిర్వ‌హించే ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్‌రెడ్డితో క‌లిసి ఆమె పాల్గొంటారు.

- Advertisement -

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పటాన్ చెరు నిర్వ‌హించే కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. అక్క‌డి నుంచి మధ్యాహ్నం తాండూరులో జరిగిన జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారు. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక రెండు సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement