Wednesday, May 15, 2024

కత్తి మహేష్ పరిస్థితి మరింత విషమం !!

సినీ నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే చెన్నై కలకత్తా రహదారిపై తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ మహేష్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ పై మహేష్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో మహేష్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరికొన్ని గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. ప్రమాద సమయంలో మహేష్ తో పాటు కార్ డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో కత్తి మహేష్ గా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆసుపత్రికి కత్తి మహేష్ బంధువులు స్నేహితులు చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement