Friday, April 26, 2024

కార్తీ ‘విరుమన్’​ మూవీ లిరికల్​ సాంగ్​.. ఈ నెల 25న రిలీజ్​

టాలివుడ్ లో కార్తి పేరు విడిగా చెప్పాల్సిని అవ‌స‌రం లేదు.. తెలుగులో ఈయ‌న సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంది. యుగానికి ఒక్క‌డు’ సినిమా నుంచి గ‌తేడాది విడుద‌లైన ‘సుల్తాన్’ వ‌ర‌కు కార్తీ నటించిన ప్ర‌తి సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల‌య్యాయి. అంతేకాకుండా కార్తి ఇక్క‌డ‌ ఇంట‌ర్వూలు గాని, స్పిచ్‌లలో గాని తెలుగులోనే మాట్లాడ‌టంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌లో మ‌రింత అభిమానం సంపాదించుకున్నాడు. అయితే.. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఐదు సినిమాల‌న్నాయి. అందులో ‘విరుమ‌న్’ ఒక‌టి. 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ సినిమాకి ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నరు.

ఈ సినిమాలో ప్రముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు అధితి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోను మే 25న‌ మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించాడు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం వినాయ‌క చ‌తుర్థి సంద‌ర్భంగా ఆగ‌స్టు 31న విడుద‌ల కానుంది. కార్తి ప్రస్తుతం పీ.ఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర్దార్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. వీటీతో పాటుగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘పొన్నీయిన్ సెల్వ‌న్’ చిత్రంలో న‌టించాడు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement