Sunday, April 28, 2024

పారిస్ ఒలింపిక్స్ నా ల‌క్ష్యం అంటున్న నిఖ‌త్ జ‌రీన్‌

2024లో పారిస్‌లో జ‌రిగే ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ తెలిపింది. ఇటీవ‌ల ఇస్తాంబుల్‌లో జ‌రిగిన వుమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో తెలంగాణ‌కు చెందిన నిఖ‌త్ 52 కిలోల ఫ్ల‌య్ వెయిట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆ విక్ట‌రీపై నిఖ‌త్ ఇవాళ ఓ మీడియాతో స్పందించింది. ఇది ఆరంభం మాత్ర‌మే అని ఆమె చెప్పింది. పారిస్‌లో జ‌రిగే ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని, దాని కోసం నిత్యం శ్ర‌మిస్తూనే ఉంటాన‌ని ఆమె అన్నారు.

వ‌ర‌ల్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం జీవితంలో మ‌రుపురాని అనుభూతి అని పేర్కొన్న‌ది. స్నేహితులు, ఫ్యామిలీతో ఈ ఆనందాన్ని పంచుకోవాల‌ని ఉంద‌ని ఆమె వెల్ల‌డించింది. వివిధ ర‌కాల క్రీడ‌ల్లో మ‌హిళ‌లు రాణిస్తూ దేశానికి గౌర‌వం తీసుకువ‌స్తున్నార‌ని నిఖ‌త్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement