Thursday, May 9, 2024

పుట్టినరోజు సందర్భంగా….అభిమానులకు కార్తీ రిక్వెస్ట్

మామూలుగా అభిమాన హీరోల పుట్టినరోజు వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ గతేడాది అలాగే ఈ ఏడాది కరోనా కారణంగా ఆ హడావిడిని ఫాన్స్చే యలేకపోతున్నారు. కాగా తమిళ స్టార్ హీరో కార్తీ 44వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు కార్తీ. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకో వద్దంటూ అభ్యర్థిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశాడు. తన పుట్టిన రోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు మంచి బహుమతి అని ఈ సమయంలో మాస్కులు, శానిటైజర్ లు వాడటం ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఈ భద్రతా చర్యలను కట్టుబడి ఉండాలని కోరారు.

ఇక కార్తీ ఇటీవల సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే చిత్రంలో నటించనున్నాడు. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష తో పాటు విక్రమ్ ప్రభు ,శోభిత ధూళిపాళ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. మరోవైపు సర్దార్ అనే చిత్రంలో కూడా కార్తీ నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement