Thursday, May 2, 2024

Japan trailer : కార్తీ జపాన్ ట్రైల‌ర్ రిలీజ్…యాక్ష‌న్, డైలాగ్స్ తో టాప్ ట్రెండింగ్ ..

కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ జపాన్. ఈ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన జపాన్ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియంలో వైభవంగా జరుగగా ఈ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేసారు మేకర్స్.

అతి పెద్ద గజదొంగ జపాన్ గా కార్తీ తన మార్క్ డిఫరెంట్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, మాస్ యాక్షన్ అంశాలు వంటివి జపాన్ ట్రైలర్ లో అదిరిపోయాయి. మొత్తంగా అయితే ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దీపావళి సందర్భంగా ఆడియన్స్ ముందుకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement