Monday, April 29, 2024

కంగువా ఓటీటీ హ‌క్కులు సొంతం చేసుకున్న.. అమెజాన్ ప్రైమ్

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం కంగువా.సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో హై బడ్జెట్ చిత్రం కంగువలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై హైప్ పెరిగిపోయింది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలిని మించే చిత్రం తెరకెక్కిస్తున్నాం అని ఆయన పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్య గెటప్ ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా అప్పుడే బిజినెస్ లో రికార్డులు మొదలుపెట్టేసింది. ఈ చిత్రంలో దిశా పటాని సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సౌత్ ఓటీటీ హ‌క్కులు రికార్డు ధ‌ర‌కి అమెజాన్ ప్రేమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల ఓటిటి రైట్స్ కి గాను అమెజాన్ సంస్థ నిర్మాతతో రూ. 80 కోట్ల మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ డీల్ ని ఫిక్స్ చేశారు. మొత్తం 10 భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయి. హీరో సూర్యకి తెలుగు తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఈ క్రేజీ హీరోకి అభిమానులు ఉన్నారు. సూర్య నటించే చిత్రాలు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement