Monday, May 6, 2024

కేర‌ళ స్టోరి మూవీ నిలిపివేత‌కు సుప్రీం నో… విడుద‌ల‌కు ముందే దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు

న్యూఢిల్లి : ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు ఆదేశాలివ్వా లన్న అభ్యర్థనను సుప్రీంకోర్ట మంగళవారం తోసిపుచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు ఆమోదించిందని, కనుక నిలిపివేయమని ఆదేశించడం కుదర దని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నమ్మలతో కూడిన ధర్మాసనం పేర్కొం ది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదిస్తూ ఈ చిత్రంలో ద్వేష ప్రసంగాలు ఉన్నాయని అన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం… సెన్సార్‌ బోర్డుపై కేసు వేయాలని పిటిషనర్‌కు సూచించారు. దాంతో సెన్సార్‌ బోర్డుపై దావా వేస్తామని కపిల్‌ సిబల్‌ కోర్టుకు విన్నవించుకున్నారు. సినిమా టీజర్‌ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారని, ఈ దశలో చిత్ర ప్రదర్శనను నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నం సృష్టిస్తున్న మూవీ
మతమార్పిడులు, ఐసిస్‌ మూలాలు, లవ్‌ జిహాద్‌ వంటి వివాదాలకు కేరాఫ్‌ కేరళ. గత దశాబ్ద కాలంలో ఈ అంశాలు అక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దేశవ్యాప్తంగాను సంచలనంగా మారాయి. జాతీ య దర్యాప్తు సంస్థలు కూడా ఇక్కడి ఉగ్రమూలాల డొంకను కదిలించి, ఉగ్రభూతం ఊడల జాడల్ని బయటకిలాగాయి. ఇక్కడి యువత ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదంలో చేరారని, పాకిస్తాన్‌, అఎn్గానిస్తాన్‌, ఇరాక్‌, సిరియా వరకు వెళ్లారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘ది కేరళ స్టోరీ’ పేరుతో తెరకెక్కిన సినిమా ప్రకంపనలు సృష్టి స్తోంది. సామాజికంగాను, రాజకీయంగాను అలజడి రేపు తోంది. కేరళ నుంచి 32వేల మంది అమ్మాయిలు తప్పిపోవ డం.. వారి అదృశ్యం వెనుక కారణాలు.. తదంనంతర పరిణా మాలే ఈ సినిమా కథాంశం. ఇందులో బ్రెయిన్‌ వాష్‌, లవ్‌ జిహాద్‌, హజాబ్‌, ఐసిస్‌ వంటి పదాలను పదేపదే వాడటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ట్రైలర్‌ ఉత్కంఠతను, ఆందోళనను కలిగిస్తోంది. ఐసిస్‌ ఉగ్రమూలాలతో సంబం ధం ఉందనే భావనే ఇందుకు కారణం. ఏప్రిల్‌ 26న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా చూశారు. కొందరు ఈ సినిమా కథను కల్పనగా కొట్టి పారేస్తుంటే, మరికొందరు మాత్రం వాస్తవికత కాబోలు అంటున్నారు..

YouTube video

ఉగ్రవాద బానిసత్వంలోకి యువతులు..?
కేరళ నుంచి తప్పిపోయిన 32 వేల మంది అమ్మాయిలను ముందుగా బ్రెయిన్‌వాష్‌ చేసి, వారిని బలవంతంగా ఇస్లాం లోకి మార్చేసి.. ఆ తర్వాత ఐసిస్‌ ఉగ్రవాదులుగా మార్చిన ట్టు ఈ కథ సాగుతుంది. కేరళలో హందూ, క్రిస్టియన్‌ అమ్మా యిలు, మ#హళలు బానిసలుగా తయారయ్యారా? 32 వేల మంది హందూ, క్రిస్టియన్‌ యువతులను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోకి చేర్చుకున్నారని సినిమాలో చేసిన వాదనలు నిజమా? అనే చర్చలు, వివాదానికి దారితీశాయి. ‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్‌లో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించింది. షాలినీ ఉన్నికృష్ణన్‌ అనే హందూ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రను అదాశర్మ పోషించింది. సినిమాలో ఆమె పేరు ఫాతిమా. బురఖా ధరించి, ఫాతిమా టీజర్‌లో ఆమె కథను వివరిస్తూ.. ‘ఆమె హందువు, ఆమె పేరు షాలిని ఉన్ని కృష్ణన్‌. ఇప్పుడు ఆమెను ఫాతిమా అని పిలుస్తున్నారు. ఆమె నర్సు కావాలనుకుంది. కానీ.. ఇప్పుడు అఎn్గాన్‌ జైల్లో ఐసిస్‌ ఉగ్రవాదిగా ఉంది’ అని పరిచయం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంతేకాదు.. ‘ఆమెలాంటి మరో 32 వేల మంది అమ్మాయిలు మతం మార్చబడి.. సిరియా, యెమెన్‌లకు పంపబడ్డారు. సాధారణ అమ్మాయిలను ఉగ్రవాదులుగా మార్చే ప్రమాదకరమైన గేమ్‌ కేరళలో బ హరంగంగా సాగుతోంది’ అని ఫాతిమా క్యారెక్టర్‌ చెబుతుంది.

వాస్తవమెంత?
ఈ సినిమాపై నిర్మాత విపుల్‌ అమృతలాల్‌ షా కీలక విషయా లు వెల్లడించారు. ‘2010లో కేరళ సీఎంగా ఉన్న ఊమెన్‌ చాందీ అసెంబ్లిలో ఒక నివేదిక వెల్లడించారు. తన హయాం లో ప్రతి సంవత్సరం 2,800 నుంచి 3,200 మంది బాలికలు ఇస్లాంను స్వీకరించారు’ అని చెప్పారు. అంటే ఐదేళ్లలో 7800కు పైగా మత మార్పిడులు జరిగాయి. రాబోయే పదేళ్లకు ఇదే అంచనా కొనసాగిస్తే, ఈ సంఖ్య 30 నుంచి 32 వేలకు చేరొచ్చని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ కూడా 32 వేల మంది అమ్మాయిల మత మార్పి డికి సంబంధించి అదే వాదనను వినిపించారు. ప్రభుత్వం ఉటంకించిన గణాంకాల ఆధారంగానే తాము ఈ సంఖ్యపై నిర్దారణకు వచ్చామని సుదీప్తో స్పష్టం చేశారు. ‘ప్రియమైన కేరళ వాసులారా.. అక్షరాస్యతలో మీరు అగ్రస్థానంలో ఉన్నారు. విద్య మనకు సహనాన్ని నేర్పింది. ఇప్పుడే ఒక అభిప్రాయానికి ఎందుకు వస్తారు..? ముందుగా సినిమా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు చర్చిద్దాం. ఈ చిత్రం కోసం ఏడేళ్లు కేరళలో పనిచేశాం. మీలో మేము ఓ భాగం. మనమందరం భారతీయులమే’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement