Sunday, October 13, 2024

భారతీయుడు2 ఆగిపోటానికి కారణం కమల్ హాసన్- శంకర్ !!

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు. సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం భారతీయుడు-2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వివాదం పై తాజాగా డైరెక్టర్ శంకర్ స్పందించారు.

చిత్రీకరణ ఆలస్యం కావడానికి నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు కమల్ హాసన్ కూడా కారణం చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా నిర్మాణ సంస్థ బాధ్యత అని కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కమల్ హాసన్ మేకప్ వల్ల ఎలర్జీకి గురవుతున్నారని ఈ క్రమంలోనే క్రేన్ యాక్సిడెంట్ జరగడం జరిగింది అని చెప్పుకొచ్చాడు. తన వల్ల ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇక ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన కోర్టు జూన్ 4వ తేదీకి కేసును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement