Monday, April 29, 2024

కరోనా కట్టడిలో కేంద్రం విఫలం: నటుడు అనుమ్ ఖేర్..

దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం ప‌లు విమర్శలను ఎదుర్కొంటోంది. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా నటుడు అనుమప ఖేర్ సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్ర‌ధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించే అనుపమ్ ఖేర్ ఇప్పుడు అనూహ్యంగా ఈసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. దేశంలో జ‌రుగుతున్న అల్ల‌క‌ల్లోలానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశానికి ఇమేజ్ సృష్టించడం కంటే ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని, దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిరోజూ కరోనా కార‌ణంగా నాలుగు వేల మంది వ‌ర‌కూ మరణిస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు వస్తున్నాయన్నారు.  ఆరోగ్య సంక్షోభాన్ని చ‌క్క‌దిద్ద‌డంలో కొంత లోపం జరిగిందని విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement