Saturday, May 18, 2024

17నుండి ప్రైమ్‌ వీడియోలో జురాసిక్​ వరల్డ్‌ డొమినియన్‌ స్ట్రీమింగ్​

ప్రభన్యూస్ : ప్రైమ్‌ వీడియో జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌ ప్రీమియర్‌ను ప్రకటించింది. ఐకానిక్‌ జురాసిక్‌ పార్క్‌తో ప్రారంభమైన ఇతిహాస కథల్లో గొప్ప ముగింపు ఈ చిత్రం. అక్టోబర్‌ 17నుండి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. మొదటి రెండు జురాసిక్‌ పార్క్‌ చిత్రాల దర్శకుడు కోలిన్‌ టెవోరో దీనికి కూడా దర్శకత్వం వహించారు. ఎగ్జిక్యూటివ్‌-నిర్మాత స్టీవెన్‌ స్పీల్బర్గ్‌ నిర్మించారు. ఇస్లా నుబ్లార్‌ విధ్వంసం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత డైనోసార్లు మళ్ళీ భూమిపై తిరుగుతున్నప్పుడు ఈ జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌ జరుగుతుంది. భూమి చరిత్ర పూర్వ మాంసాహారుల ఆధిపత్యంలో మరోసారి చిక్కుకొని విపత్తు పర్యవసానాలను ఎదుర్కొంటున్నప్పుడు, రెండు తరాల జురాసిక్‌ హీరోలు ఏకమవుతారు.

వైద్యులు ఎల్లీ సాట్లర్‌ (లారా డెర్న్‌), ఇయాన్‌ మాల్కం (జెఫ్‌ గోల్డ్‌ బ్లమ్‌), అలాన్‌ గ్రాంట్‌ (సామ్‌ నీల్‌)లు… ఓవెన్‌ గ్రేడీ (క్రిస్‌ ప్రాట్‌), క్లెర్‌ డియరింగ్‌ (బ్రైస్‌ డల్లాస్‌ హోవార్డ్‌)లతో కలిసి మానవులు, డైనోసార్ల భవితవ్యాన్ని నిర్ణయించే నమ్మశక్యం కాని సాహసం కోసం తిరిగి వస్తారు. ప్రైమ్‌ మెంబర్స్‌ ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్‌ అక్టోబర్‌ 17 నుంచి చూడవచ్చని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement