Tuesday, April 30, 2024

అందం అలంక‌ర‌ణ‌..

వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్‌. తల్లి బాటలోనే గ్లామర్‌రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. ఇప్పటికే హిందీ సినిమాల ద్వారా తన ప్రతిభచాటుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో ఎంట్రీ ఇస్తోంది. శ్రీదేవికి తిరుగులేని స్టార్‌డమ్‌ అందించిన తెలుగు సినిమాల్లో నటిస్తోంది. జూ.ఎన్టీఆర్‌ తాజా చిత్రంలో జోడీగా నటిస్తోంది. ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ కాంబినేషన్‌ పట్ల సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సోషల్‌ మీడియాలో ఏక్టివ్‌గా ఉండే జాన్వీకపూర్‌ ఎప్పటికప్పుడు తన కొత్త చిత్రాలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా బ్లాక్‌ బాడీకాన్‌ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆభరణాల అలంకారం అదనం. మెడరన్‌గా ఉండటంతో తల్లిబాటనే అనుసరిస్తున్నట్టుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement