Friday, May 10, 2024

చీర‌క‌ట్టుతో ఫుట్ బాల్ ఆడిన.. మ‌హిళ‌లు

చీర‌క‌ట్టుతో ఫుట్ బాల్ ఆడారు ప‌లువురు మ‌హిళ‌లు. సాధారణంగా మహిళలు ఫుట్ బాల్ ఆడటమే చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటిది వారు ఏకంగా చీరలు కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ ధరించి అదరగొట్టేశారు. ఈ సంఘటన గ్వాలియర్ లో చోటుచేసుకుంది.. గ్వాలియర్ లో కొందరు మహిళలు ఫుట్ బాల్ ఆడారు. వీడియో చిన్నదే అయినప్పటికీ.. వారు ఆట ఆడిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అదరగొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోలో కనిపించే మహిళలంతా 25 నుంచి 50ఏళ్ల వయసు వారు కావడం విశేషం. ఈ రోజుల్లో అమ్మాయిలు చీర కట్టుకొని సరిగా నడవడం కూడా రాక ఇబ్బందిపడుతున్నారు. అలాంటిది మహిళలంతా కలిసి చీర‌క‌ట్టులో ఫుట్ బాల్ ఆడ‌టం గ్రేట్ అంటున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement