Tuesday, May 21, 2024

మంచు విష్ణు తో రొమాన్స్ చేయబోతున్న జాతిరత్నాలు హీరోయిన్ ?

జాతి రత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పుడు మంచు హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఢీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాను సంప్రదించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకు ఫరియా అబ్దుల్లా సెట్ అవుతుందని దర్శకుడు శ్రీను వైట్ల భావిస్తున్నాడట. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఇది హిట్ అయితే మాత్రం ఈ అమ్మడికి అవకాశాలకు కొదవ ఉండదు. మరి ఏమవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement