Friday, May 3, 2024

జ‌పాన్ మ్యాగ‌జైన్ పై చ‌ర‌ణ్.. తార‌క్

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం RRR.ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు ఎన్టీఆర్, రామ్ చరణ్.. కాగా వీరు అరుదైన అవకాశాన్ని పొందారు.. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడా నెగ్గిన ఈ చిత్రం జపాన్ దేశంలో 200 రోజులు కంప్లీట్ అయ్యినా కూడా ఇంకా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపుతుంది. జపాన్ లో అయితే రామ్ చరణ్ కి .. ఎన్టీఆర్ కి భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరిపై లేటెస్ట్ గా జపాన్ కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ ‘ఆనన్’ వారు ఓ బ్యూటిఫుల్ పిక్ ని పొందుపరిచారు. ఈ ఇద్దరు హీరోస్ కూడా తమదైన లుక్స్ తో అదరగొట్టగా వీరి లుక్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. దీనితో ఈ ఫేమస్ మ్యాగజైన్ పోస్టర్ వైరల్ గా మారింది.చ‌ర‌ణ్‌..తార‌క్ ని చూస్తుంటే రెండు క‌ళ్లు చాల‌వ‌ని ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement