Thursday, May 2, 2024

పాత్రత ఎంచక చేసే దానం!

కొన్ని దానాలు అపాత్రం అయ్యే అవకాశం ఉంది. ధనా న్ని లేదా విద్యను ఇతరులకు ఇచ్చే సందర్భాలలో అది పొందేవారి అర్హత చూస్తాం. పరిశీలిస్తాం. అది దుర్వి నియోగం కాకూడదనే ఆశతో. కాని పాత్రత ఎంచక చేసే దానం ఒక్కటే ఒక్కటి. అదే అన్నదానం. దానికి ఉండవలసిన ఒకే అర్హత. నకనకలాడే ఆకలి. అది ఒక్కటే అర్హత. కారణం అన్నదానం దుర్వినియోగం కాదు గనుక.
అతడు ధనికుడా, నిరుపేదా, ఆడ మగా, చిన్నా పెద్దా, ఈ దానాన్ని పొందే పాత్రతకు అర్హత ఉందా లేదా అన్న యోచన లేక చేసే దానమే అన్నదానం. ‘అన్నిదానాలకన్నా అన్నదానం మిన్న’ అని స్మృతులు చెబుతున్నాయి. క్షుద్భాధ మించిన నర కం లేదు. తైత్తరీయోపనిషత్తు ఆహారం పరబ్రహ్మ స్వరూపమ ని, సమస్త జీవులు ఆహారం నుంచే ఉద్భవిస్తున్నాయి, చనిపో యిన పిదప ఆహారంలో ప్రవేశిస్తున్నాయని చెప్పింది.
ఒకసారి సాక్షాత్‌ అన్నపూర్ణ నిలయమైన కాశీనగరానికి వ్యాసమహర్షి వచ్చా రు. ఆయనకు బాగా ఆకలి వేసింది. అక్కడి గృహస్థుల ఇళ్ల ముందుకు వెళ్లి ‘భవతీ భిక్షాం దే#హ’ అని అడిగారు. కాశీలో పలు ఇళ్ల ముందర అడిగినా ఆయనకు ఎవ రూ భిక్ష పెట్టలేదు. చివరకు కుపితుడై చేతిలో నీరు తీసుకుని ”కాశీలో అన్నం లభించకుండుగాక” అని శపించే సమయంలో కాశీ విశాలాక్షి ప్రత్యక్షం అయి ”మహర్షీ! అన్నీ తెలిసిన మీరు కూడా సహనం కోల్పోతే ఎలా” అంది. అంతట మహశ్వరుడు కూడా ప్రత్యక్షమై ”మీ సహనానికి పరీక్ష ఇది” అన్నారు. దాంతో శాంతించిన వ్యాసమహర్షి క్షుద్బాధ ఎంతటివారినైనా దిగజారుస్తుందని తనను శాపం ఇచ్చే పాపం నుంచి కాపాడినందుకు ఆదిదంపతులకు కృతజ్ఞత తెలిపాడు.
క్షుద్బాధ భరించలేక విశ్వామిత్ర మహర్షి శునక మాంసం తిన్నాడని మహా భారతంలో ఉంది. ”ఆపద్కాలే సంప్రాత్తే సౌచాచారం వ విచింతయేత్‌” ఆపద్కా లంలో ఆచారాలంటూ మడికట్టుకు కూర్చుంటే ప్రాణానికే హాని కలుగుతుంది. అప్పుడు ”శరీర మాధ్యమం కడు ధర్మసాధనం” అని గుర్తించాలని పరాశర స్మృ తి చెబుతున్నది.
విశ్వామిత్రుడు తపస్సు సాధనలో ఉన్నాడు. ఆ సమయంలో రాజ్యంలో తీవ్ర దుర్భిక్షం సంభవించింది. ఆకలితో ఉన్న విశ్వామిత్రుడికి తినడానికి ఏమీ దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆకలి తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒకచోట కొందరు మాంసం తింటూ కనిపించారు. ఆయన వారిని తనకూ పెట్టమని అడిగారు. వారు ”స్వామీ! ఇది శునక మాంసమ”న్నారు. అయి నా పర్వాలేదని తీసుకుని తిని క్షుద్బాధను తీర్చుకున్నాడు. అనంతరం వారు సొరకాయలోని నీరు తాగమన్నారు. ఆయన తిరస్కరించారు. ‘ఎందుకు?’ అని వారు ప్రశ్నించగా ”మాంసం తినడం వల్ల శరీరానికి కొంత శక్తి వచ్చింది. ఇప్పు డు ఆహారాన్ని వెతుక్కునే శక్తి వచ్చింది కావున నీరు స్వీకరణ అధర్మం అవుతుం ద”ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
క్షుద్బాధ పై మరోకథ ఉంది. ”ఒక రాజు వేటకు వెళ్లాడు. అలసిపోయేవర కూ వేటాడాడు. అయనతో వచ్చిన పరివారం తప్పిపోయింది. ఆయనకు ఆకలి, దాహం విపరీతంగా కలిగాయి. అక్కడికి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. పూట కూళ్ల పెద్దమ్మ ఇల్లు కనిపించింది. దాంతో ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. అక్కడికి వెళ్లి తాను ఫలానా అని, ఆకలి వేస్తోంది ఆహారం పెట్టమన్నాడు. అప్పు డు ఆమె ”రాజా! వండినవి అన్నీ అయిపోయాయి. కేవలం పచ్చడి, అన్నం మా త్రమే ఉన్నాయి” అంది. అవే పెట్టమన్నాడు. ఆమె పెట్టింది. రాజు తృప్తిగా తిని వెళుతూ ”పెద్దమ్మా! నీవు పెట్టిన పచ్చడి బహు రుచిగా ఉంది. మా పాకశాలలో ఎప్పుడూ ఇలాంటి పచ్చడి చేయలేదు. ఎలా చేయాలో చెప్పమ”న్నాడు. అందు కు ఆమె వణుకుతూ ”రాజా మీరు నన్ను శిక్షించానని మాట ఇస్తే చెబుతాను” అంది. ”సరే” అన్నాడు రాజు. ”మీరు వచ్చేటప్పటికి వండినవన్నీ అయిపోయా యి. వంట సరుకులు కూడా నిండుకున్నాయి. ఏమీ తోచక లేత గడ్డిపరకలతో పచ్చడి చేశానని దానిని మీకు వడ్డించాను” అన్నది. ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న మాటకు ఈ సంఘటన గొప్ప ఉదాహరణ.
”ఆకలితో ఉన్నవారికి శాస్త్రములు, కళలు నేర్పితే ఉపయోగం ఉండద”ని వివేకానందుడు చెప్పాడు. వారి ఆకలి తీర్చడమే మార్గమన్నారు. ఖాళీ కడుపుతో ఉన్న వ్యక్తికి ఏమి చెప్పినా ఫలితం ఉండదన్నారు.
ఖాళీ కడుపుతో భగవంతుని ప్రార్థించినా స్థిర చిత్తం కలగదన్నారు సాయిబా బా. మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంటికి ఆకలితో వచ్చిన వారికి తప్పక భోజ నం పెట్టాలని షిరిడి నాథుడు చెబుతున్నాడు. ముందుగా బీదవారు, వికలాంగు లకు ఆహారం ఇవ్వాలన్నారు. వీరికి పెట్టిన తరువాత బంధువులకు పెట్టాలన్నా రు. ఏ ఇతర జీవులైనా ఆ సమయంలో ఆకలితో ఉంటే వాటికి పెట్టి అనంతరమే మనం తినాలని బాబా బోధించారు. ఆకలి సర్వ జీవులకు సమానమేనన్నారు. మనం చిన్నతనంలో అశోకుడు సత్రములు కట్టించి, చల్లదనం కోసం రహదారు ల వెంట చెట్లు నాటించాడని చదువుకున్నాం. రాజులు పరిపాలిస్తున్న కాలంలో బాటసారుల సౌకర్యార్థం సత్రాలు కట్టించి అన్నదానం చేసేవారు. ఆ తర్వాత కాలంలో ధర్మాత్ములు, వితరణశీలురు సత్రాలు నిర్మించి పొరుగు ఊర్లనుంచి వచ్చేవారికి ఉచితంగా వసతి, ఆహారం అందించేవారు. ఇప్పటికీ ప్రతి ఊరులో నూ సత్రాలు కనిపిస్తాయి. ప్రస్తుతకాలంలో తీర్థయాత్ర ప్రదేశాల్లో ఆయా దేవాల యాల యాజమాన్యం భక్తులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో నిత్యాన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాల యాల్లో భోజన సదుపాయం లభిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా మండపేట గ్రామంలో 1841 ఏప్రిల్‌లో జన్మించిన సీతమ్మ అక్షర జ్ఞానం అంతగా లేకపోయినా తండ్రి బువ్వన్న (అన్నం పెట్టే అన్న అని అక్కడి ప్రజలు పిలిచేవారు) అడుగుజాడల్లో అన్నార్తులకు అన్నదానం చేసే వారు. లంక గన్నవరానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్నతో వివాహం జరిగింది. గోదావరి ముఖ స్థానంలో ఉన్న గన్నవరం మీదగా వెళ్లే ప్రయాణీకుల ఆకలి తీర్చే మహాఇల్లాలుగా సీతమ్మ పేరు పొందింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు సీతమ్మ గారి చేతి అన్నం తిననివారు లేరంటే అతిశయోక్తి లేదు. ఒకసారి ఆమె అంతర్వేది ఆలయానికి వెళ్లాలని బయలుదేరింది. అది ఆమె చిరకాల వాంఛ. మార్గమధ్యంలో బోయలు పల్లకీ దింపి విశ్రాంతి తీసుకుంటు న్నారు. అప్పుడు మధ్యాహ్నం దాటింది. ఇంతలో బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ పిల్ల తల్లి ”ఏడవకమ్మా వచ్చేసాం… కొంచెం సేపట్లో సీతమ్మగారి ఇంటికి చేర తాం. ఆ తల్లి మనకు తప్పక భోజనం పెడుతుంద”ని ఆకలితో ఏడుస్తున్న పిల్లను అనునయిస్తున్నది. వెంటనే డొక్కా సీతమ్మ బోయలను వెనక్కి ఇంటికి పదమన్న ది. వారు చేరే లోపే ఇల్లుకు చేరుకుని వంట పూర్తిచేసి వారు రాగానే ఆప్యాయతతో వడ్డించి వారి ఆకలిబాధ తీర్చింది. అదే అన్నపూర్ణతత్వం. అది ఒక్క డొక్కా సీత మ్మగారికే చెల్లు. అందుకే ఆమె పేరు ప్రఖ్యాతులు లండన్‌ వరకూ చేరాయి. బ్రిటీ ష్‌ ఇండియా కాలంలో నిత్యాన్న దాత డొక్కా సీతమ్మ పేరు ప్రఖ్యాతులు ఇంగ్లండ్‌ రాజు వరకు చేరాయి. ఆనంద చకితుడయ్యాడు. ఆయన తన పట్టాభిషేక సమ యంలో ఆమె ఫొటో తెప్పించి నమస్కారం చేసి పట్టాభిషిక్తుడయ్యాడు. అన్న దాన ప్రాముఖ్యత అదే!

Advertisement

తాజా వార్తలు

Advertisement