Tuesday, May 7, 2024

Jabardasth : బ‌జ‌ర్ద‌స్త్ కు కొత్త యాంక‌ర్ జ‌వాన్ సిరి …

బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు కొత్త యాంకర్ వ‌చ్చేసింది. సౌమ్య రావు స్థానంలో సిరి హన్మంత్‌ను తీసుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఆమెను పరిచయం చేశారు. సిరి ఇటీవలే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో ఆమె కనిపించింది. ఓ పాత్రలో అలరించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే సిరి హన్మంత్ పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్-5లోనూ మెరిసింది. కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపుతోపాటు ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సిరి బాలీవుడ్ మూవీ నుంచి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్‌ అవకాశాన్ని దక్కించుకుంది.
ఇది ఇలా ఉంటే బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు సంబంధించిన యాంకర్లు, జడ్జీలు క్రమంగా మారుతున్న విషయం తెలిసిందే. రోజా, నాగబాబు షోకు తొలుత జడ్జీలుగా వ్యవహరించారు. చాన్నాళ్ల తర్వాత తప్పుకున్నారు. ఆ తర్వాత మను, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement