Sunday, May 5, 2024

ADB: అభివృద్ధిని చూసి ఓటెయ్యండి… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణ చందా, నవంబర్ 6 (ప్రభ న్యూస్) : అభివృద్ధిని చూసి ఓటేయాలని, ఇతర పార్టీల వాళ్ళ మాయమాటలకు మోసపోవద్దని, నెలకు ఒకసారి నియోజకవర్గానికి వచ్చే నేతల మాటలు అసలే నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం లక్ష్మణ్ చందా మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కనకాపూర్ వడ్యల్ రాచాపూర్ పీచ్చరా ధర్మారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుండి సాగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ… బీజేపీ పార్టీ అభ్యర్థి గతంలో చేసిన సేవలు ఏమి లేవని, ఆయన గెలిచిన ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ఇక అలాంటి వారు చెప్పే మాయమాటలను నమ్మవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.

నెలలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాని వ్యక్తి అభివృద్ధి ఎలా చేస్తాడని ప్రశ్నించాడు. కాంగ్రెస్ అభ్యర్థి అసలు పోటీలోనే లేడని విమర్శించాడు. ఇలా అప్పుడప్పుడు వచ్చి వెళ్లే వారి మాటలు నమ్మవద్దని ఆగం కావద్దని ప్రజలను కోరారు. వృద్ధులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పెన్షన్లను 2016 నుండి 5016కు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6016 రూపాయల వరకు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలిపారు. 21సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 3వేల రూపాయలను సౌభాగ్య లక్ష్మి పథకం కింద అందించనున్నట్లు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంకు వచ్చిన మంత్రికి అన్ని గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. రాచాపూర్ గ్రామంలో కనకాపూర్ గ్రామంలో నృత్యాలు చేస్తూ మహిళలు కోలాటాలాడుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇదిలా సాగుతుండగా ఆయా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువాను వేసుకొని పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జ్ సురేందర్ రెడ్డి, ఎంపీపీ పద్మ రమేష్, జెడ్పీటీసీ రాజేశ్వర్, సర్పంచులు సాదం బోర్రవ్వ, గంగారం సుక్కు, రాజవ్వ, ముత్తన్న, బుర్రి లతా భూమేష్, రాజేందర్ రెడ్డి, రాజేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెంకట్ రాజు, నాయకులు రాజేందర్ యాదవ్, మాజీ సైనిక ఉద్యోగి ఆర్మీ రాజేంద్రప్రసాద్, నరేశ్ రెడ్డి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement