Friday, May 3, 2024

Fake Video – ర‌ష్మిక ఫేక్ వీడియో…. స్పందించిన కేంద్రం…

ఎన్ని జాగ్రతలు తీసుకున్నా సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. వానిటి వైరల్ చేస్తూ వారి పర్శనల్ లైఫ్ కు ఇబ్బందులు కలిగేలా కొందరు చేస్తున్నారు. తాజాగా నటి రష్మిక మందన్న ఫేక్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న డీప్ నెక్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో లిఫ్ట్ లోపల నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ రష్మికనే అని పొరపడుతున్నారు. బహిరంగా ప్రదేశాల్లో రష్మిక ఇలాంటి డ్రెస్‌ వేయడం ఏంటి..? మరీ ఇంత హాట్‌గా ఎందుకు కనిపించారు..? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.. ఆ వీడియోను చూసి చాలా మంది షాకింగ్ అంటూ కామెంట్స్ చేసారు.

అయితే ఈ వీడియోలో రష్మిక కాదని అర్దమైంది. కావాలని కొందరు ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించి హల్ చల్ చేశారు. అలాగే ఆమె ఫారిన్ స్లాంగ్ మాట్లాడడం చూస్తే అది పక్కా ఫేక్ వీడియో అని..ఏఐతో మార్పింగ్ చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కేంద్ర స్పందించింది.. ఇటువంటి ఫేక్ వీడియోలు రాకుండా ఆయా సోష‌ల్ మీడియాలు నియంత్రించాల‌ని కేంద్రం స్ఫ‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement