Saturday, May 4, 2024

పవన్ తో వైష్ణవ్ తేజ్ సినిమా ?

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. ఇక నటుడిగా కూడా వైశావ్ కు మంచి పేరును తీసుకువచ్చింది. అయితే వైష్ణవ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఉప్పెన హిట్ తరువాత వైష్ణవ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ నిర్మాణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథతో సినిమాచేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. త్వరలోనే దర్శకుడి పేరును కూడా అధికారిక ప్రకటన చేయనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement