Saturday, April 27, 2024

‘మేజర్’ టీజర్ కోసం ముగ్గురు స్టార్స్

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు ప్రధాన పాత్రలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. శశి కుమార్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సైయూ మంజ్రేకర్ ,శోభిత ధూళిపాళ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇదిలా ఉండగా తెలుగు హిందీ మలయాళం సూపర్ స్టార్ తో మేజర్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లు రిలీజ్ చేయనున్నారు. వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సోమవారం సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement