Tuesday, May 7, 2024

మహాసముద్రంలో అనసూయ ?

జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అనసూయ. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు బుల్లితెరపై మెరుస్తూనే వెండి తెరపై కూడా సందడి చేస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడికి సినిమాలో ఐటమ్స్ సాంగ్ ఆఫర్స్ వరుస వస్తున్నాయి. మొన్నటికి మొన్న చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అలాగే ఖిలాడీ చిత్రంలో కూడా కీలక రోల్ పాత్రలో నటిస్తుంది. ఇంకా త్వరలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement