Sunday, April 28, 2024

బిగ్ బాస్ 5…ఈ సారి రానా వంతు ?

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కి సిద్ధమవుతోంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ సీజన్ కు సంబంధించి ఎవరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు అనేదానిపై కొత్తగా ఓ వార్త తెరపైకి వచ్చింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే సీజన్ 2 కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే సీజన్ 3, 4కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

అయితే ఈసారి నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండటంతో దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరించనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రానా తో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే సీజన్ 5కు హోస్ట్ గా రానానే వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement