Sunday, April 28, 2024

నారప్ప రిలీజ్ డేట్ నిజమేనా ?క్లారిటీ ఎప్పుడు !!

తమిళంలో ధనుష్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి వెంకటేష్ సరసన నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో వచ్చే నెల 24న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని టాక్ నడిచింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు.

ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్ ,రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ పై చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement