Thursday, May 2, 2024

‘ఆర్​ఆర్​ఆర్’ సెట్​లో పిల్లాడితో అల్లూరి..

కరోనా సెకండ్ వేవ్ మందగించడంతో సినిమాల చిత్రీకరణ తిరిగి ప్రారంభమయ్యాయి. పాన్ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్ కూడా ఇటీవల షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారుడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ఈ సెట్‌లో ఉన్న చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి. చరణ్ లుక్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోర మీషాలు, బ్లాక్ కలర్ పాంట్, టీ షర్ట్ తో చరణ్ లుక్ ని చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ప్రస్తుతం రామ్​చరణ్ -​ ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌నే వీరిద్దరిపై ఓ పాట కూడా  చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకమపై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: http://రాజమౌళి ఇచ్చిన సర్ ప్రైజ్….ఆర్ఆర్ఆర్ న్యూ లుక్

Advertisement

తాజా వార్తలు

Advertisement