Sunday, April 28, 2024

ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్.. వకీల్ సాబ్-2 క‌న్ఫామ్ చేసిన డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా రిలీజ్ రెండేళ్లు పూర్తి చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సోషల్ డ్రామా పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ మూమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా వచ్చింది. ఇక‌, ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుండ‌టంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోష‌ల్ మీడియాలో సినిమా గురించి #2yearsforbbVakeelSaab హ్యాష్ ట్యాగ్ తో డిస్క‌ష‌న్ స్టార్ట్ చేశారు. ఈ చర్చలో ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ కూడా చేరారు.

అందులో భాగంగా.. వకీల్ సాబ్ ఖచ్చితంగా రీ-రిలీజ్ అవుతందని అభిమానుల‌కు మాట ఇచ్చాడు. అంతే కాకండా.. వకీల్ సాబ్ 2 కూడా ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపాడు వేణు శ్రీరామ్. దీంతో వకీల్ సాబ్ 2 ట్యాగ్ ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇక‌ వకీల్ సాబ్ సీక్వెల్ గురించి విన్న అభిమానులు సంతోషంతో పండ‌గ చేసుకుంటున్నారు. మరి వకీల్ సాబ్ పార్ట్ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్ర‌స్తుతం, వర్క్ ఫ్రంట్‌లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌, సుజీత్ OG షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement