Thursday, May 2, 2024

నాగ చైతన్య “కస్టడీ” నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో యువ నటుడు అక్కినేని నాగ చైతన్య మొదటిసారిగా చేస్తున్న మూవీ ‘కస్టడీ’. ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామాగా తరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. కాగా, ఈ మల్టీలింగువల్ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇవ్వాల ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. హెడ్‌ అప్‌ హై అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుది.

అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. నాగ చైతన్య తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీకి సరిగ్గా సరిపోయాడు.

అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను స్వరపరిచారు, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై బ్యాంక్రోల్ చేయబడింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement