Monday, April 29, 2024

భారీ షిప్ లో.. జవాన్ మూవీ సాంగ్ షూట్

త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో జ‌వాన్ అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార న‌టిస్తోంది. కాగా హీరో షారుక్ ఖాన్, నయనతారల‌ పై వచ్చే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. భారీ షిప్‌లో సాంగ్‌ చిత్రీకరణకు సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.. ద‌ర్శ‌కుడు అట్లీ ఈ పాటను సినిమాకు హైలెట్‌గా నిలిచేపోయేలా ప్లాన్ చేశాడని విజువల్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఫరాఖాన్‌ ఈ పాటకు కొరియోగ్రాఫర్‌ కాగా.. పాపులర్ సింగర్ అర్జీత్ సింగ్ పాడారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్‌ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ తెర‌కెక్కిస్తుండటం విశేషం. ఇప్పటివరకున్న అప్‌డేట్స్ ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement