Thursday, March 28, 2024

జాక్వెలిన్ ఆస‌నాలు.. ఫొటోల‌కి లైక్ కొట్టిన త‌మ‌న్నా

రూ.200కుంభ‌కోణం కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్ర‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింది బాలీవుడ్ న‌టి జాక్వెలిన్. దీంతో ఆ కుంభకోణంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. పలమార్లు విచారణకు హాజరవుతోంది. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘క్రాక్’, ‘ఫతే’ చిత్రాల్లో నటిస్తోంది. సౌత్ లో కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణా’లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. ‘రా రా రక్కమ్మ’ సాంగ్ తో యువతను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తోంది. చివరిగా ‘సెల్పీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలతో బిజీగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలో తాజాగా జాక్వెలిన్ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ ఏకంగా ఏరియల్ యోగితో గాల్లో కఠిన ఆసనాలు వేశారు. ఆ ఫొటోలను అభిమానుతో పంచుకున్నారు. ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ ఇంతలా శ్రమిస్తుండటంతో ఫ్యాన్స్ పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. బ్లాక్ వర్కౌట్ డ్రెస్ లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ యువతను కట్టిపడేస్తోంది. జాక్వెలిన్ పంచుకున్న ఫొటోలపై ఏకంగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కూడా స్పందించారు. జాక్వెలిన్ పంచుకున్న ఆ ఫొటోలను లైక్ చేసి అభినందించింది. మరోవైపు నెటిజన్లు కూడా లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. సాహోలో స్పెష‌ల్ సాంగ్ లో మెప్పించి తెలుగువారికి ప‌రిచ‌య‌మ‌యింది జాక్వెలిన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement