Wednesday, May 1, 2024

ఓటీటీ లో ‘ఇలియానా’ టాక్ షో

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని అడ్డుకున్న ఇలియానా టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అంతే కాదు ఆ తర్వాత ప్రేమ, డేటింగ్ అంటూ సినిమాలకు దూరం అయింది.

లాంగ్ గ్యాప్ తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ… అది సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఓటీటీ సంస్థలకు ఆదరణ పెరిగింది. వెబ్ సిరీస్ లకు, టాక్ షో లకు రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పటికే ఆహా లో సమంత చేస్తున్న టాక్ షో హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఇలియానా తో టాక్ షో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయట. అంతేకాకుండా ఈ టాక్ కోసం ఇలియానాకి రెమ్యూనరేషన్ కాస్త గట్టిగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement