Sunday, May 19, 2024

నటి కాకపోయి ఉంటే..!

గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టాలని నేటి యువత ఆసక్తి చూపుతోంది. ఉన్నత విద్యలో సినిమాకు సంబంధించి శిక్షణ తీసుకుంటూ సినిమాల్లోకి వస్తున్నారు. చాలా మంది నాయికలు థియేటర్‌ ఆర్ట్స్‌ చదివిన తర్వాత నటిగా వచ్చినట్టు చెబుతున్నారు. గతంలో డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చెప్పేవారు. క్రమక్రమంగా అది ఓ జోక్‌గా మారింది. కానీ నిజంగానే డాక్టర్‌ చదివి కూడా సినిమానటిగా మారిన నాయికలు ఉన్నారు. ఇప్పటికే సినీరంగంలో ఉన్న నాయికలకు ఒక్కో సారి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవు తుంటాయి. వాటికి నిజాయితీగా సమాధానం ఇస్తుంటారు నాయికలు. సరిగ్గా ఇలాంటి ప్రశ్న నటి పాయల్‌ రాజ్‌పుత్‌కు ఎదురైంది. ఆర్‌ ఎక్స్‌ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేస్తోంది. వెంకీ మామ, డిస్కో రాజా తాజాగా తీస్‌మార్‌ఖాన్‌ చిత్రాల్లో నటించింది.

ఈ సందర్భంలో ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా అభిమానులతో చిట్‌ చాట్‌లో పాల్గొంది. మీరు నటి కాకుండా ఉంటే.. ఏం చేసే వారు అని ఓ అభిమాని పాయల్‌ రాజ్‌ పుత్‌ని ప్రశ్నించాడు. దీనికి పాయల్ స్పందించింది. తనకు జర్నలిజం అంటే ఇష్టమని, ఇంకా న్యూస్‌ యాంకర్‌ అయ్యేదానిని అంటూ సమాధానం ఇచ్చింది. ఢిల్లికి చెందిన పాయల్‌ తొలుత హిందీ టీవీ సీరియల్స్‌ ద్వారా తన నట ప్రస్తానం ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, పంజాబీ సినిమాల్లో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement