Friday, May 3, 2024

విద్యుత్ జ‌మ్వాల్ తాజా చిత్రం IBI.. ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ హీరో విద్యుత్ జ‌మ్వాల్ తాజా చిత్రం IBI.ఈ చిత్రాన్ని దాదాపు ఏడేళ్ల తర్వాత ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌తోనే మేకర్స్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. యాభై ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా ఉంచిన ఇండియాస్ టాప్ సీక్రెట్ మిషన్ ‘IB71’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని స్పష్టం చేశారు. 30 మంది ఏజెంట్లు 10 రోజుల పాటు చేపట్టిన అత్యంత రహస్య మిషన్‌ గురించి ఈ సినిమాలో చర్చించ బోతున్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి IB ఏజెంట్ దేవ్ జమ్వాల్ (విద్యుత్ జమ్వాల్) ఎలాంటి సాహాసాలు చేశాడు అనేది ట్రైలర్‌లో చూపించారు.ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను టీ సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ సంస్థలతో కలిసి విద్యుత్‌ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement