Thursday, May 2, 2024

చ‌ర‌ణ్ అండ్ ఉప్సీకి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు.. చిరంజీవి ట్వీట్

నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఉపాస‌న‌ల 11వ పెళ్లిరోజు. ఈ దంపతులకు మరికొన్ని రోజుల్లో బిడ్డ జన్మించబోతున్న నేపథ్యంలో ఈ వెడ్డింగ్ యానివర్సరీ వీరికి మరెంతో ప్రత్యేకంగా మారింది. మరోవైపు వివాహ వార్షికోత్సవం సందర్భంగా చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడు చరణ్, కోడలు ఉపాసనలకు గ్రీటింగ్స్ తెలియజేశారు. హాయ్ చరణ్ అండ్ ఉప్సీ… ప్రత్యేకమైన ఈ రోజున మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ మేం ఎంతో గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేశారు. మీరిద్దరూ తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్. మీ బిడ్డపై మీకుండే ప్రేమ ఇతరులు కూడా చెప్పుకునే విధంగా ఉండాలి. లవ్ అండ్ బ్లెస్సింగ్స్… అమ్మ, నాన్న అని చిరంజవి ట్వీట్ చేశారు. ఈ మేర‌కు రామ్ చ‌ర‌ణ్..ఉపాస‌న‌ల ఫొటోని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement