Monday, April 29, 2024

రిప్లై ఇవ్వ‌క‌పోతే చస్తానంటూ హీరో విశ్వ‌క్ సేన్ అభిమాని బెదిరింపు..

హీరో విశ్వ‌క్ సేన్ కి తన అభిమాని చుక్కలు చూపించాడు. ఖాళీ సెష‌న్స్ లో అభిమానులతో ముచ్చటించిన విశ్వ‌క్ సేన్..చాట్‌లో భాగంగా త‌న‌కు ఇలియానా ఫ‌స్ట్ క్ర‌ష్ అని, ఆమె కోసం నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక నెంబ‌ర్ ఇవ్వ‌మ‌ని అడిగితే, త‌ప్ప‌క ఇస్తాను.. ఇంతకీ ష‌ర్ట్ ఆర్ ప్యాంట్, ఏది గిఫ్ట్ గా ఇవ్వ‌బోతున్నావు అంటూ కొంటెగా స‌మాధానం ఇచ్చాడు. మ‌రో నెటిజ‌న్ నా మ‌న‌సులో ఉంటున్నందుకు 10 వేల రూపాయ‌లు పంపించు అని అడిగాడు. ఇదిలా ఉంటే ఓ వ్య‌క్తి .. ‘అన్నా నువ్వు రిప్లై ఇవ్వ‌క‌పోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు’ అని కామెంట్ చే‌శాడు. దీంతో ఖంగు తిన్న విశ్వ‌క్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. మీ గుండెల్లో ఎప్పుడు ఉంటా అని అతనిని శాంతింప‌జేశాడు. ప్ర‌స్తుతం ఓ మై క‌డ‌వులే రీమేక్‌లో న‌టిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైంద‌ని స్ప‌ష్టం చేశాడు విశ్వ‌క్ సేన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement