Friday, March 29, 2024

ఎఫ్3 షూటింగ్ మొదలు పెట్టేది అప్పుడేనట ?

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఎఫ్2 కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ ను జూన్ ఫస్ట్ వీక్ నుండి హైదరాబాదులోని సారథి స్టూడియోలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సారధి స్టూడియోలో వేసిన ఓల్డ్ హౌస్ సెట్ లో వెంకీ, వరుణ్ మధ్య కామెడీ సీన్స్ తెరకెక్కించనున్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎఫ్ 2 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్ రావిపూడి.. ఈసారి డబ్బు వల్ల వచ్చే సమస్యలను చూపించబోతున్నాడట. ఇక ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేసే విధంగా నిర్మాత దిల్ రాజు, సురేష్ బాబు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement