Friday, May 10, 2024

తండ్రైన హీరో సుహాస్.. ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ యాక్టర్

‘కలర్‌ ఫొటో’ ఫేం, నటుడు సుహాస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తండ్రిని అయ్యానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. తన భార్య లలిత సోమవారం (జనవరి 22) మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశాడు సుహార్‌. ఈ ఫొటోను షేర్‌ చేస్తూ “మాకు మగబిడ్డ పుట్టాడు. ప్రొడక్షన్‌ నెం1” అంటూ కొడుకును పరిచయం చేశాడు సుహాస్. కాగా సుహాస్‌ 2017లో తన ప్రియురాలు లిఖితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడేళ్లకు వారికి కుమారుడు జన్మించడంతో సుహాస్‌ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement