Sunday, April 28, 2024

శివ‌కార్తికేయ‌న్ మూవీకి.. జీవిప్ర‌కాష్ కుమార్ సంగీతం

రాజ్ కుమార్ పెరియాసామి తెర‌కెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు హీరో శివ కార్తికేయన్ . ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహిత జీ.వి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్‌ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమలో శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో చాలా వరకు చిత్రీకరణ కశ్మీర్‌ ప్రాంతంలోనే జరుగనుందట. ఈ సినిమాలో ఆర్మీ లుక్‌ కోసం శివ కార్తికేయన్ తన బాడీని మేకోవర్‌ చేసుకున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement