Saturday, May 4, 2024

ర‌వితేజ రావ‌ణాసుర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

రావ‌ణాసుర చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు హీరో ర‌వితేజ‌. ఎప్పుడు హీరోగానే కాకుండా.. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలనిజం చూపించారు మాస్ మహరాజా. అభిషేక్ పిక్చర్స్.. ఆర్టీటీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా.. రవితేజ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ కీలకపాత్రలలో నటించారు.
ఈ క్రమంలోనే రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. నైజాంలో రూ. 1.64 కోట్లు రాబట్టగా.. సీడెడ్ లో రూ. 70 లక్షలు.. యూఏలో.. రూ. 61 లక్షలు.. తూర్పు గోదావరి.. రూ. 30 లక్షలు.. పశ్చిమ గోదావరి రూ. 21 లక్షలు.. గుంటూరు రూ. 45 లక్షలు.. కృష్ణ.. రూ. 23 లక్షలు.. నెల్లూరు రూ. 15 లక్షలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 4.29 కోట్లు వసూలు చేయగా.. 6.70 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 0.26 కోట్లు కాగా.. ఓవర్సీస్ రూ. 0.30 కోట్లు రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ రూ. 4.85 కోట్లు కలెక్షన్స్.. రూ. 7.85 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీపై ఏకంగారూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక 23 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు 4.85 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా క్లీన్ హిట్ కావాలంటే.. 18.15 కోట్ల షేర్ రాబట్టాలి. ఇక ఈ వీకెండ్ రెండు రోజులు కలెక్షన్స్ భాగానే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఏప్రిల్ 7న విడుదలైన రావణాసుర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కెరియర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్‏తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హై వోల్టేజ్ యాక్షన్ కమర్షియల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో ఈ మూవీని ప్రేక్షకులకు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement