Sunday, April 28, 2024

పరేషాన్ ని సమర్పిస్తుండటం గర్వంగా ఉంది.. రానా ట్వీట్

హీరో రానా సమర్పణలో పరేషాన్ మూవీ రూపొందుతుంది. తాజాగా పరేషాన్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రానా ఇప్పటికే తెలుగులో కేరాఫ్‌ కంచరపాలెం, 777 చార్లీ, కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, గార్గి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించగా.. ఈ సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నాయి. సమోసా తింటారా.. కొత్త సినిమా పరేషాన్‌ను సమర్పిస్తుండటం గర్వంగా ఉంది. అద్బుతమైన యాక్టింగ్, అందమైన సంగీతం, పొట్టచెక్కలయ్యే కామెడీ, మీ కుటుంబం, స్నేహితులతో ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు రానా. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. గతేడాది మసూద సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు తిరువీర్. కాగా ఆయ‌న హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరేషాన్ . రూపక్ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.పరేషాన్ చిత్రంలో పావని కర్ణన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బన్నీ అభిరామ్‌, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, బద్దెర ఖాన్‌, రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశ్వంత్ నాగ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సిద్దార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన పరేషాన్ టీజర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement