హీరో నాగచైతన్య 45రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని పలకరించారు. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. సుప్రసిద్ధ రచయిత మాథ్యూ మెక్ కొనాఘే రచించిన గ్రీన్ లైట్స్ అనే పుస్తకంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీన్ లైట్స్ పుస్తకం జీవితానికి ప్రేమలేఖ వంటిదని నాగచైతన్య అభివర్ణించారు.మీ జీవన ప్రస్థానాన్ని పంచుకున్నందుకు థాంక్యూ మెక్ కొనాఘే అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం చదవడం ద్వారా తన జీవితంలోనూ కాంతిరేఖలు పరుచుకున్న అనుభూతిని పొందానని అన్నారు. ఈ పుస్తకం చదివిన అనంతరం మీరంటే ఎంతో గౌరవం కలుగుతోంది సర్” అంటూ స్పందించారు.
45రోజుల తర్వాత ఇన్ స్టాలో నాగచైతన్య..ఏమన్నారో తెలుసా..
By Maha Laxmi

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement